Andhra Pradesh: వైఎస్ వివేకా హత్యకేసు.. నిందితులకు 14 రోజుల రిమాండ్ పొడిగింపు!

  • నేటితో ముగిసిన నిందితుల రిమాండ్
  • కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు
  • గత నెల 15న దారుణహత్యకు గురైన వివేకానందరెడ్డి

వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో పోలీసులు ఈరోజు వారిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ ను పొడిగించారు. అనంతరం పోలీసులు వీరిని జైలుకు తరలించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్‌లకు పులివెందుల కోర్టు 12 రోజులు రిమాండ్ విధించింది. వైఎస్ వివేకానందరెడ్డిని గత నెల 15న పులివెందులలోని సొంతింటిలో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
YSRCP
YS VIVEKA
MURDER CASE
  • Loading...

More Telugu News