Andhra Pradesh: ఈ ఎన్నికల్లో టీడీపీ అడ్రసు గల్లంతు కావడం ఖాయం: జీవీఎల్

  • ఏపీలో అభివృద్ధి పచ్చచొక్కాలకే పరిమితమైంది
  • టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
  • ‘ప్రకాశం’కు వికాసం లేకుండా టీడీపీ చేసింది

ఏపీలో అభివృద్ధి పచ్చచొక్కాలకే పరిమితమైందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.ప్రకాశం జిల్లా టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, పచ్చ చొక్కాల, జన్మభూమి కమిటీల అనుమతి లేనిదే అభివృద్ధి జరగట్లేదని ఆరోపించారు. ఏపీలో మాఫియా సామ్రాజ్యం ఉంది తప్ప, ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. అందుకే, ఈ ఎన్నికల్లో టీడీపీ అడ్రసు గల్లంతు కావడం ఖాయమని, ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు.

 ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు కూడా టీడీపీకి రాదని, ఎందుకంటే, ప్రకాశం జిల్లా వికాసం చెందకుండా టీడీపీ దుర్మార్గపు రాజకీయాలు చేసిందని అన్నారు. అభివృద్ధినే మంత్రంగా చేసుకుని మోదీ పాలన సాగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశంసించారు. మళ్లీ మోదీ ప్రభుత్వమే రావాలని ప్రజలందరూ అనుకుంటున్నారని, మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh
GVL
Bjp
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News