Andhra Pradesh: మా నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. తప్పుడు వార్తలను నమ్మవద్దు!: ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల

  • ఎన్నికల ప్రచారంలో నాన్నకు వడదెబ్బ తగిలింది
  • హైదరాబాద్ లోని ‘కేర్’ లో చికిత్స అందజేస్తున్నాం
  • ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది

నంద్యాల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన నేత ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని కూడా కథనాలు వచ్చాయి. కాగా, ఈ వార్తలను ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల ఖండించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె తెలిపారు.

నాలుగు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా తన తండ్రికి వడదెబ్బ తగిలిందన్నారు. దీంతో ఆయన్ను  హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదనీ, వాటిని నమ్మవద్దని ప్రజలను కోరారు.

Andhra Pradesh
Kurnool District
spy reddy
Jana Sena
health
fake news
sujala
daughter
  • Loading...

More Telugu News