Lagadapati Rajagopal: ఎవరికి ఓటు వేయాలో అందరికీ తెలుసు: లగడపాటి

  • నాలుగు రోజుల్లో ఎన్నికలు
  • అనుభవజ్ఞులకే పట్టం కడతారు
  • తిరుమలలో లగడపాటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసునని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అనుభవజ్ఞులకే ప్రజలు పట్టం కడతారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీ భవిష్యత్తు కోసం అనుభవజ్ఞుల అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు దీన్నే పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసిన తరువాతే ప్రజలు తమ ఓటును వేస్తారని అన్నారు. తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత తన సర్వే ఫలితాలు వెల్లడిస్తానని చెప్పారు. 

Lagadapati Rajagopal
Andhra Pradesh
Elections
Vote
Experience
  • Loading...

More Telugu News