advani: అద్వానీ, జోషీలను కలవనున్న అమిత్ షా?

  • ఎన్నికలకు దూరంగా అగ్రనేతలు
  • టికెట్ ఇవ్వని బీజేపీ అధిష్ఠానం
  • మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో కలవనున్న అమిత్ షా

అసహనంలో ఉన్న పార్టీ సీనియర్లు అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేడు కలవనున్నట్టు సమాచారం. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్న తరుణంలో అగ్రనేతలను కలవనున్నారు. తద్వారా పార్టీ సీనియర్లను మోదీ, అమిత్ షాలు అగౌరవపరుస్తున్నారనే అపవాదును చెరిపేసుకునే ప్రయత్నం కూడా చేయనున్నారు.

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అద్వానీ, జోషీలకు బీజేపీ టికెట్ ఇవ్వని సంగతి తెలిసిందే. మరోవైపు తన బ్లాగు ద్వారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విమర్శించే నేతలపై దేశద్రోహం ముద్ర వేయరాదని అన్నారు. బీజేపీని వ్యతిరేకించేవారు దేశ వ్యతిరేకులు కాదని చెప్పారు. తనకు పార్టీ కంటే దేశమే ముఖ్యమని చెప్పారు. అద్వానీ వ్యాఖ్యలు విపక్షాలకు మంచి ఆయుధంలా మారాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతలను కలసి, నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి అమిత్ షా యత్నిస్తున్నారు.

advani
murali manohar joshi
amit shah
bjp
  • Loading...

More Telugu News