South Africa: ఘోర రోడ్డు ప్రమాదంలో బిడ్డతో సహా దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ దుర్మరణం!

  • దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎల్ రీసా కారుకు ప్రమాదం
  • అక్కడికక్కడే మరణించిన ఎల్ రీసా, ఆమె బిడ్డ
  • సంతాపం తెలిపిన క్రికెట్ సౌతాఫ్రికా

దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు తరఫున ఎన్నో మ్యాచ్ లాడిన ఎల్ రీసా తున్నీసెస్ ఫౌరీ (25) ఘోర రోడ్డు ప్రమాదంలో తన బిడ్డ సహా దుర్మరణం పాలైంది. కేప్ టౌన్ సమీపంలోని మైనింగ్ సిటీ స్టీల్ ఫౌంటెన్ మార్గంలో ఆమె ప్రయాణిస్తున్న వేళ ఈ ప్రమాదం జరిగింది. దేశం తరఫున ఆడుతూ ఆల్ రౌండర్ గా రాణించిన ఆమె, పలు స్థానిక జట్లకు కోచ్ గానూ వ్యవహరించారు.

ప్రమాదంపై స్పందించిన క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎల్ రీసా మృతి మాటలకందని విషాదమని అన్నారు. ప్రమాదంలో ఆమె, ఆమె బిడ్డ మరణించిందన్న వార్త విని తాను దిగ్భ్రాంతి చెందానని, క్రికెట్ ను ఎంతో ప్రేమించిన ఆమె అద్భుత ప్రతిభావంతురాలని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నానని పేర్కొన్నారు. 2013 ఉమెన్స్ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా తరఫున ఆడిన ఎల్ రీసా, సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరిసారి కనిపించారు.

South Africa
Cricket
Elrisa
Died
  • Loading...

More Telugu News