Posani Krishna Murali: జగన్ దుర్మార్గుడని ప్రూవ్ చేస్తే, పవన్ కల్యాణ్ కాళ్లకు నమస్కరించి, పాలాభిషేకం చేస్తా: పోసాని కృష్ణమురళి

  • ఆధారాలు ఇస్తే, ఇంట్లో పవన్ బొమ్మ పెట్టుకుంటా
  • జగన్ ను పవన్ అపార్థం చేసుకున్నారు
  • అమ్మమ్మ వయసున్న లక్ష్మీపార్వతిపై లైంగిక ఆరోపణలా?
  • హైదరాబాద్ లో పోసాని విమర్శలు

వైఎస్ జగన్ మీద పలు ఆరోపణలు చేస్తున్న జనసేన నేత పవన్ కల్యాణ్, వాటిని నిరూపిస్తే, తాను కాళ్లకు నమస్కరించి, పాలాభిషేకం చేస్తానని నటుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ అవినీతిపై ఆధారాలు ఇస్తే, తన ఇంట్లోని జగన్ బొమ్మ తీసేసి పవన్ బొమ్మ పెట్టుకుంటానని అన్నారు. జగన్ చాలా గొప్ప వ్యక్తని, క్యారెక్టర్ ఉన్న మనిషని, పవన్ ఎందుకు అపార్థం చేసుకున్నారో తెలియడం లేదని అన్నారు.

ఇక లోకేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనకు డబ్బు, మందు, అమ్మాయిలు తప్ప మరో ధ్యాస లేదని, కొన్ని పాత ఫోటోలను మీడియా ముందు పోసాని ప్రదర్శించారు. ఇదే తరహా ఫోటోలో జగన్ ఉండి, రాధాకృష్ణకు దొరికుంటే, ఫ్రంట్ పేజీలో నిత్యమూ వేసుండేవారని సెటైర్లు వేశారు. ఇదే సమయంలో చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శిస్తూ, విమర్శల వర్షం కురిపించారు. 70 ఏళ్ల వయసున్న లక్ష్మీ పార్వతిపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, అమ్మమ్మ వయసులో ఉన్న ఆమెపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

Posani Krishna Murali
Nara Lokesh
Jagan
Pawan Kalyan
Chandrababu
  • Loading...

More Telugu News