Posani Krishna Murali: వాడో ఊసరవెల్లి... నటుడు శివాజీపై మండిపడ్డ పోసాని కృష్ణమురళి!

  • ఒక్కో మీడియా సమావేశంలో ఒక్కోలా మాట్లాడతాడు
  • ఎన్ని తిట్టినా తక్కువే
  • వీడియోలను ప్రదర్శించిన పోసాని

నటుడు శివాజీ రాజా ఓ ఊసరవెల్లి వంటి వాడని, ఒక్కో మీడియా సమావేశంలో ఒక్కోలా మాట్లాడే అతని గురించి ఎన్ని తిట్టినా తక్కువేనని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబును దెయ్యమని కటువు వ్యాఖ్యలు చేసిన శివాజీ, ఆ తరువాత మాట మార్చి ఇప్పుడు దేవుడంటున్నాడని చెబుతూ, శివాజీ వ్యాఖ్యల వీడియోను పోసాని ప్రదర్శించారు.

 టీవీ 9 రవిప్రకాశ్, ఏబీఎన్ రాధాకృష్ణలు శివాజీతో కలిసి వైఎస్ జగన్ ను అన్ పాప్యులర్ చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆఫ్ ది రికార్డ్ లో శివాజీ ఎన్నో మాటలు మాట్లాడాడని, అవన్నీ చెబితే, శివాజీని ప్రజలు నడిరోడ్డుపై కొడతారని అన్నారు. మీడియా అంటే ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలని, కానీ ఏపీలో అలా జరగడంలేదని అన్నారు.

అసలు ఓ మతిస్థిమితం లేని వ్యక్తి మాటలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రెండు నాలుకల ధోరణితో మాట్లాడేవారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. రేపటితో మాట్లాడటం పూర్తవుతుందని, ఇక ఎవరూ ఎవరిపైనా విమర్శలు చేయరని, ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పోసాని అభిప్రాయపడ్డారు.

Posani Krishna Murali
Chandrababu
Sivaji
Videos
  • Loading...

More Telugu News