Shashi Tharoor: మోదీకి ఆ దమ్ముందా?.. సవాల్ చేసిన శశిథరూర్

  • రాహుల్ వాయినాడ్‌కు పారిపోయారని బీజేపీ ఎద్దేవా
  • మోదీకి దక్షిణాది నుంచి  పోటీ చేసే దమ్ము లేదన్న శశిథరూర్
  • తర్వాతి ప్రధాని ఇక్కడి నుంచేనన్న సీనియర్ నేత

ప్రధాని నరేంద్రమోదీకి దమ్ముంటే కేరళ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సవాలు విసిరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గెలుస్తానన్న పూర్తి విశ్వాసంతోనే అటు ఉత్తరాదిలోను, ఇటు దక్షిణాదిలోనూ పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీకి కూడా దమ్ముంటే దక్షిణాదిలో పోటీ చేయాలని  సవాల్ చేశారు.

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారని పేర్కొన్న శశిథరూర్.. దేశ తర్వాతి ప్రధాని దక్షిణాది నుంచే వస్తాడని ప్రజలు భావిస్తున్నారని థరూర్ పేర్కొన్నారు. ఓటమి భయంతో రాహుల్ వయనాడ్‌కు పారిపోయారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంలో అర్థం లేదన్నారు. వాయినాడ్ నుంచి పోటీ చేయాలంటూ రాహుల్‌పై అనూహ్యమైన ఒత్తిడి రావడం వల్లే రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు.

Shashi Tharoor
Congress
BJP
Narendra Modi
Kerala
Tamil Nadu
  • Loading...

More Telugu News