Vijay Sai Reddy: ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న చంద్రబాబు: విజయసాయి రెడ్డి

  • జనాలను నమ్మించేందుకు ప్లాన్
  • పచ్చ మీడియా నుంచి సలహాలు
  • ఇక స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలన్న విజయసాయి

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఎలా మభ్యపెట్టాలో తెలియక చంద్రబాబునాయుడు మల్లగుల్లాలు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. "తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని లగడపాటితో చెప్పించాలా? ఇంకో రూపంలో వెల్లడించాలా? అని మల్లగుల్లాలు పడుతున్నారట చంద్రబాబు. లగడపాటి, ఏదైనా చానల్ కలసి చేసిన సర్వే అని చెప్పిస్తే జనాలను నమ్మించవచ్చని పచ్చమీడియా సలహా ఇచ్చిందిట. స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలి" అని ఆయన అన్నారు.

ఆ తరువాత "హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్స్ రష్యా సైనికులు మనోధైర్యం కోల్పోయేలా ప్లాన్లు వేసేవాడు. రష్యా ఓడిపోయిందని, మీరూ లొంగిపోవాలని రష్యన్ భాషలో ముద్రించిన కరపత్రాలను సైనికుల బంకర్లపై వెదజల్లించేవాడు. గోబెల్స్ చంద్రబాబు ఆంధ్రజ్యోతి ద్వారా ఇలాంటి ప్రచారమే చేస్తున్నారు" అని ఆరోపిస్తున్నారు. ఇంకా "లక్ష్మీస్‌ ఎన్టీర్‌ సినిమా నెల కిందటే రిలీజై ఉంటే ఈ పాటికి అందరూ మర్చిపోయేవారు. చంద్రబాబు, పచ్చ మీడియా చేసిన నిర్వాకానికి జనాల్లో దానిపై ఎక్కడ లేని ఆసక్తి ఏర్పడింది. 'యాత్ర' మూవీ అంతే. రిలీజ్ కాకుండా చూశారు. సూపర్‌హిట్‌ అయింది. ఇపుడు టీవీలో వస్తుందంటే మళ్లీ వణుకుతున్నారు" అని కూడా ఆయన ట్వీట్ చేశారు.







Vijay Sai Reddy
Chandrababu
Twitter
Lagadapati
  • Loading...

More Telugu News