Congress: కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారు.. ఆయనకు ఓటెయ్యొద్దు: వివేక్ సోషల్ మీడియా సందేశం

  • ఇటీవల టీఆర్ఎస్‌ను వీడిన పెద్దపల్లి మాజీ ఎంపీ
  • ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు
  • కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ నియోజకవర్గ ప్రజలకు పిలుపు

టీఆర్ఎస్‌కు ఇటీవల రాజీనామా చేసిన పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశం వైరల్ అవుతోంది. కేసీఆర్ తనను నమ్మించి మోసం చేశారని, ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో టీఆర్ఎస్‌ను ఓడించాలని అందులో పిలుపునిచ్చారు. అంతేకాదు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభిమానులను కోరారు. ఈసారి పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించిన వివేక్ భంగపడ్డారు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తనను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.

వివేక్ గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోని తన నివాసంలో అనుచరులతో సమావేశం అవుతున్నారు. వివేక్ తాజా పిలుపుతో ఆయన అనుచరులు పెద్దపల్లి నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. కాగా, టీఆర్ఎస్‌ను వీడిన వివేక్‌తో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోపాటు ఏఐసీసీ నేతలు కూడా టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.  

Congress
TRS
KCR
Peddapalli District
Gaddam vivek
Telangana
  • Loading...

More Telugu News