Nizamabad District: నిజామాబాద్‌లో గంట ఆలస్యంగా పోలింగ్.. మాక్ పోలింగ్ కోసం సమయం మార్పు

  • నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు
  • ఉదయం ఆరు నుంచి 8 వరకు మాక్ పోలింగ్
  • పోలింగ్ సమయాన్ని మార్చిన అధికారులు

నిజామాబాద్‌లో పోలింగ్ సమయాన్ని మార్చినట్టు ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. సాధారణంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉండగా, గంట ఆలస్యంగా మొదలుపెట్టి గంట ఆలస్యంగా ముగించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇక్కడి నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో మాక్ పోలింగ్ పూర్తి చేసేందుకు సమయాన్ని మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది ఒక్క నిజామాబాద్‌కు మాత్రమే పరిమితమని, మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే పోలింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల తేదీని మార్చాలంటూ అభ్యర్థులు చేసిన వినతిని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందన్న రజత్ కుమార్ 9వ తేదీన రైతులు నిజామాబాద్‌లో ర్యాలీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

Nizamabad District
Polling
Election officer
Telangana
  • Loading...

More Telugu News