Uttar Pradesh: తల్లిదండ్రులు ఓటేస్తే వాళ్ల పిల్లలకు పరీక్షల్లో 10 మార్కులు ఫ్రీ!

  • లక్నోలో క్రైస్ట్ చర్చ్ స్కూలు వినూత్న ఆలోచన
  • ఓటింగ్ శాతం పెంచడానికి ప్రణాళిక
  • విస్తృతంగా ప్రచారం

దేశం మొత్తం ఎన్నికల జ్వరంతో ఊగిపోతోంది. ఓవైపు లోక్ సభ ఎన్నికలు, మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో ఎక్కడ చూసినా రాజకీయ కోలాహలం కనిపిస్తోంది. అయితే, పోలింగ్ శాతం పెంచడం కోసం లక్నోలోని ఓ పాఠశాల వినూత్నంగా ఆలోచించింది. తమ స్కూల్లో చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఓటేస్తే వాళ్ల పిల్లలకు పరీక్షల్లో 10 మార్కులు ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ స్కూలు పేరు క్రైస్ట్ చర్చ్ స్కూలు. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్చే ఛటర్జీ దీనిపై మాట్లాడుతూ, ఓటింగ్ లో పాల్గొనడం అనేది నిబద్ధతకు సంబంధించిన అంశమని తెలిపారు.

2014 ఎన్నికల్లో యూపీలో కేవలం 58.44 శాతం ఓటింగ్ నమోదైంది. అందుకే యూపీలో అనేక విద్యాసంస్థలు ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేస్తున్నాయి. ఇప్పుడు క్రైస్ట్ చర్చ్ స్కూలు కూడా అదే బాటలో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. తమ స్కూలు విద్యార్థులకు నిర్వహించే వార్షిక పరీక్షల్లో 10 మార్కులు తప్పనిసరిగా కలుపుతామని తెలిపారు. అయితే వారి తల్లిదండ్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఆ మార్కులు కలుపుతామని స్పష్టం చేశారు. తమ నిర్ణయంతో ఓటింగ్ శాతం కొంతమేర పెరిగినా అది సంతోషదాయకమేనని ప్రిన్సిపాల్ ఛటర్జీ తెలిపారు.

  • Loading...

More Telugu News