Andhra Pradesh: తెలంగాణ జూలు పట్టుకుని జగన్ గబ్బిలంలా వేలాడుతున్నారు!: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్

  • మోదీ డైరెక్షన్ లోనే జగన్ నడుస్తున్నారు
  • జగన్ ఏపీలో ఒక్క రాత్రయినా గడిపారా?
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

ప్రధాని మోదీ డైరెక్షన్ లో జగన్ నడుస్తున్నారని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి, నదుల అనుసంధానం సహా పలు ముఖ్యమైన విషయాలను పెట్టనేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జగన్ బానిసగా మారారని దుయ్యబట్టారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.

ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఒక్కరాత్రి అయినా రాష్ట్రంలో గడిపారా? అని ప్రశ్నించారు. తెలంగాణ జూలు పట్టుకుని గబ్బిలంలా జగన్ వేలాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలోని 40 నదులను అనుసంధానిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. నదుల అనుసంధానంతో ఏపీ రూపురేఖలే మారిపోతాయని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమన్నారు.

Andhra Pradesh
Telangana
YSRCP
Jagan
rajendra prasad
Telugudesam
Narendra Modi
KCR
  • Loading...

More Telugu News