Andhra Pradesh: సీఎం రమేశ్ స్వయంగా పోలీస్ దాడి చేయించుకున్నారు.. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక బయటపెట్టింది!: జీవీఎల్

  • టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది
  • అందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారు
  • విజయవాడలో మీడియాతో బీజేపీ నేత

టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే  ప్రజలను మభ్య పెట్టడానికి కొత్త నాటకాలు ఆడుతున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. సీఎం రమేశ్ కావాలనే పోలీసులతో తన ఇంటిపై దాడులు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక బయటపెట్టిందని వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో సానుభూతి కోసమే టీడీపీ నేతలు ఈ డ్రామాకు తెరలేపారని దుయ్యబట్టారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా డ్రామాలు ఆడినందుకు సీఎం రమేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

డ్రామాలు చేయడం టీడీపీ నేతలకు కొత్తేం కాదని విమర్శించారు. సీఎం రమేశ్ డ్రామాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలన్నారు. ప్రజలను మోసం చేసిన టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని జీవీఎల్ పిలుపునిచ్చారు.

Andhra Pradesh
Telugudesam
CM Ramesh
BJP
gvl
  • Loading...

More Telugu News