Andhra Pradesh: బిడ్డను బడికి పంపే ప్రతీ అమ్మకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తాం!: ఏపీ సీఎం చంద్రబాబు

  • పసుపు-కుంకుమ కింద ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చుపెడతాం
  • టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి
  • అమరావతిలో ఏపీ సీఎం టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ లో మహిళల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బిడ్డను బడికి పంపే ప్రతీ అమ్మకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో పసుపు-కుంకుమ పథకం కింద మొత్తం రూ.50,000 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామనీ, ఓడరేవులు, విమానాశ్రయాలు నిర్మించామని చంద్రబాబు తెలిపారు. తటస్థులు, మేధావులను టీడీపీ వైపు ఆకర్షించాలని సూచించారు. ఐదేళ్లలో ప్రభుత్వం పడ్డ ఇబ్బందులు, చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీతోనే ఏపీ భవిష్యత్తు ఉంటుందని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని తెలిపారు. ఈ సారి పొరపాటు చేస్తే రాష్ట్ర భవిష్యత్తుకే పెనుప్రమాదం అని చంద్రబాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News