Andhra Pradesh: జగన్ ఇంటికి వచ్చిన మోత్కుపల్లి.. రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు!

  • ఏపీ, తెలంగాణ రాజకీయాలపై చర్చ
  • టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమన్న మోత్కుపల్లి
  • మరుసటి రోజే జగన్ తో సమావేశం

తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈరోజు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసానికి మోత్కుపల్లి వచ్చారు. ఆయన్ను వైసీపీ నేతలు సాదరంగా లోపలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్ తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమని నిన్న మోత్కుపల్లి ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో జగన్ తో ఈరోజు మోత్కుపల్లి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Andhra Pradesh
Jagan
Chandrababu
Telugudesam
Telangana
KCR
motkupalli
  • Loading...

More Telugu News