Telugudesam: రెండు నిజాలు చెబుతానంటూ మీడియా ముందుకు వచ్చిన సినీ నటుడు శివాజీ

  • ది ట్రూత్ పేరుతో రూపొందించిన వీడియో ప్రదర్శన
  • ఆసక్తికరంగా సాగుతున్న శివాజీ సంభాషణ
  • చివర్లో మరింత మజా ఉంటుందని వ్యాఖ్య

నేడు సంచలన విషయాలు వెల్లడించబోతున్నానంటూ నిన్ననే చెప్పిన నటుడు శివాజీ అనుకున్నట్టే మీడియా ముందుకు వచ్చారు. మీడియా అనుకున్నదానింటే ఎక్కువ ట్విస్టే ఉంటుందన్న శివాజీ ముఖ్యంగా రెండు విషయాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించానని పేర్కొన్నారు. తన బాధంతా ప్రజల కోసమేనన్న శివాజీ.. ఏదైనా విషయం ఉంటే తప్ప తాను మీడియా ముందుకు రానని పేర్కొన్నారు.

 ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారంలో నిజమెంత ఉందో బయటపెట్టేందుకే మీడియా ముందుకు వచ్చానన్న శివాజీ.. పోలవరంలో ఒక్క ఇటుక కూడా పడలేదన్న వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. చెప్పేదానికంటే కళ్లతో చూస్తేనే నిజాన్ని నమ్ముతారన్న ఉద్దేశంతో పోలవరంలో ఏం జరుగుతోందో స్వయంగా అక్కడికి వెళ్లి తెలుసుకున్నానంటూ ‘ది ట్రూత్’ పేరుతో తీసిన వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు.

Telugudesam
Jagan
Polavaram
Shivaji
Chandrababu
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News