Andhra Pradesh: రేపు టీవీల్లో ‘యాత్ర’ సినిమాను ఆపేయాలన్న టీడీపీ విజ్ఞప్తిని తిరస్కరించిన ఈసీ!

  • రేపు మధ్యాహ్నం 12 గంటలకు ’స్టార్ మా’లో సినిమా
  • చిత్రాన్ని ఆపేయాలని ఈసీకి టీడీపీ ఫిర్యాదు
  • యాత్ర సినిమా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం లేదన్న ఈసీ

యాత్ర సినిమాను అడ్డుకోవాలని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదును ఈసీ తోసిపుచ్చింది. స్టార్ మా ఛానల్ లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్న యాత్ర సినిమా ఎన్నికల నియమావళిని ఏ రకంగానూ ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేవని తేల్చిచెప్పింది. ఈ మేరకు టీడీపీ నేతల ఫిర్యాదుకు ఈసీ జవాబు ఇచ్చింది. ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు ఈసీ లేఖ రాసింది.
సరిగ్గా ఎన్నికలకు 4 రోజుల ముందు వైఎస్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాను టీవీల్లో ప్రసారం చేయడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ద్వారా  ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందనీ, పోలింగ్ ముగిసేవరకూ చిత్రాన్ని ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరారు. టీడీపీ నేత వర్ల రామయ్య నేతృత్వంలో పలువురు నేతలు ఈసీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాగా, టీడీపీ నేతల ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ‘స్టార్ మా’ ఛానల్ లో యాత్ర సినిమా రేపు ప్రసారం కాకుండా నిలిపివేసేందుకు నో చెప్పింది.

  • Loading...

More Telugu News