RRR: 'ఆర్ఆర్ఆర్' నుంచి తప్పుకున్న ఎన్టీఆర్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్!

  • అనివార్య కారణాలతో తప్పుకున్న డైసీ
  • ఆమె భవిష్యత్ బాగుండాలి
  • ప్రకటించిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

"అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' లో కొనసాగలేకపోతున్నారు. ఆమె భవిష్యత్‌ అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాం" అని చిత్ర బృందం ఈ ఉదయం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో ఆలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ హీరోయిన్లుగా ఎంపికైనట్టు ఇటీవల తమ మీడియా సమావేశంలో రాజమౌళి ప్రకటించగా, డైసీ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. ఇక సినిమా గుజరాత్ షెడ్యూల్ ను ఆటంకాలు ఎదురైనప్పటికీ పూర్తి చేశామని రాజమౌళి ప్రకటించారు. సరైన సమయంలోనూ షూటింగ్ పూర్తి అయిందని, ధర్మజ్ం సిద్ధాపూర్ ప్రజలు తమనెంతో ఆదరించారని, వారు చూపిన ఆదరణకు, ఆతిథ్యానికి కృతృజ్ఞతలని ట్విట్టర్ లో తెలిపారు.

RRR
NTR
Ramcharan
Rajamouli
Daisy Edgar Jones
  • Loading...

More Telugu News