Andhra Pradesh: ఏపీలో ఈసారి జగన్ గెలవడం ఖాయం.. ఆయన ఎన్డీయేలోకి రావాలి!: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

  • ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధ్యం కాదు
  • ఏపీకి ఇస్తే మిగతావారు కూడా కోరతారు
  • మచిలీపట్నంలో కేంద్ర మంత్రి పర్యటన

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే తెలిపారు. ఒకవేళ ఏపీకి ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఏపీని అన్నిరకాలుగా ఆదుకునేందుకు, సాయం అందజేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. మచిలీపట్నంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి శివనాగేశ్వరావు తరఫున అథవాలే ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీయేలోకి చేరాలని జగన్ ను ఆహ్వానిస్తున్నట్లు రాందాస్ పిలుపునిచ్చారు. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Jagan
YSRCP
NDA
RAMDAS
  • Loading...

More Telugu News