Petrol: ఓటేసి వస్తే 'పెట్రో' రాయితీ: ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్

  • లీటరు ఇంధనంపై 50 పైసల రాయితీ
  • ఓట్లు వేసేలా ప్రోత్సహించేందుకే
  • అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్

ఈ ఎన్నికల్లో ఓటేసిన తరువాత పెట్రోలు బంకులకు వచ్చే వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ పై రాయితీ ఇవ్వాలని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఓటేసి వచ్చి, చూపుడు వేలిపై ఉండే సిరా మార్క్ ను చూపిస్తే, లీటర్ ఇంధనంపై 50 పైసల రాయితీ పొందవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ వెల్లడించారు. ప్రజలు ఓట్లు వేసేలా ప్రోత్సహించేందుకే ఈ రాయితీని ప్రకటించామని ఆయన అన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Petrol
Diesel
Rebate
Price
  • Loading...

More Telugu News