Congress: 10న రాహుల్ అమేథీలో, 11న సోనియా రాయబరేలీలో నామినేషన్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-99276259349a4aedee46a16eb0f0637250c9a5f2.jpg)
- వయనాడ్‌లో ఇప్పటికే నామినేషన్ వేసిన రాహుల్
- అమేథీలో రాహుల్‌కు ప్రత్యర్థిగా స్మృతి ఇరానీ
- సోనియాతో తలపడుతున్న దినేశ్ ప్రతాప్ సింగ్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నామినేషన్ల దాఖలు ముహూర్తం ఖరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి రెండు చోట్ల పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ వయనాడ్‌లో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, ఈ నెల 10న అమేథీలో నామినేషన్ వేయనున్నారు.
ఇక సోనియా గాంధీ ఈ నెల 11న రాయబరేలీలో నామినేషన్ దాఖలు చేస్తారు. సోనియా గాంధీపై బీజేపీ నేత దినేశ్ ప్రతాప్ సింగ్ బరిలో నిలవగా, రాహుల్‌పై అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే తలపడగా, రాహుల్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.