Chandrababu: ఇదంతా మోదీ ఆదేశాల మేరకే జరుగుతోంది: సీఎస్ బదిలీపై చంద్రబాబు ఆగ్రహం

  • ఈసీ ఉద్దేశపూర్వకంగా బదిలీలు చేస్తోంది
  • నేను మీకు ఊడిగం చేయాలా?
  • విశాఖ సభలో చంద్రబాబు ప్రసంగం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖపట్నం రోడ్ షోలో ఉండగానే, ఏపీ సీఎస్ బదిలీ సమాచారం అందుకున్నారు. సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తోందని ఆరోపించారు. ఇదంతా ప్రధాని మోదీ ఆదేశాల మేరకే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులకు సహకరిస్తూ తమపై దాడులు చేయిస్తున్నారని, మోదీ, అమిత్ షా తనను బెదిరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి మీకు నేను ఊడిగం చేయాలనా మీ ఉద్దేశం? అంటూ నిప్పులు చెరిగారు.

"ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందో లేదో ఒక కలెక్టర్ ను మార్చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారు. ఆపై ఇంటలిజెన్స్ డీజీని మార్చేశారు. ఏం తప్పు చేశారని వారిని మార్చారు? జవాబు చెప్పాలి. కారణాలు లేకుండానే మార్చారు. ఇప్పుడు సీఎస్ వంతు వచ్చింది. దీనిపై నిలదీయాల్సింది ఎవరిని?" అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

"తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేశారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీస్ వాహనంలో డబ్బులు తీసుకెళితే ఈసీ పట్టుకోలేకపోయింది. చివరికి సారీ చెబుతారు!" అంటూ ధ్వజమెత్తారు. "డేటా చౌర్యంపై సిట్ వేసి ఆధారాలు ఇమ్మంటే ఎన్నికల కమిషన్ మీనమేషాలు లెక్కిస్తోంది ఏ కంప్యూటర్ నుంచి చౌర్యం జరిగిందో చెప్పరా. ఏ పాపం తెలియని చీఫ్ సెక్రటరీని, డీజీని బదిలీ చేస్తారా? ఏంచేస్తారో చేసుకోండి... లెక్కకూడా పెట్టుకోను!" అంటూ సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News