Yatra: ‘యాత్ర’ను టీవీల్లో ప్రసారం చేయడం కోడ్ ఉల్లంఘనే: వర్ల రామయ్య

  • ద్వివేదిని కలిసిన వర్ల రామయ్య
  • లక్ష టన్నుల ఐరన్ ఓర్ దోచుకున్నారు
  • లారీల కిందపడి 300 మంది మృతి

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ను టీవీ ఛానళ్లలో ప్రసారం చేయకుండా ఆపాలని వర్ల రామయ్య కోరారు. నేడు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

‘యాత్ర’ సినిమాను టీవీల్లో ప్రదర్శించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని తాను పేర్కొనగా, చిత్రం ప్రసారం కాకుండా చూస్తానని ద్వివేది చెప్పారని వర్ల రామయ్య పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని తెస్తామని చెప్పడం అవినీతి కాదా? అని ప్రశ్నించారు. గాలి జనార్దన్‌రెడ్డితో కలిసి లక్షల టన్నుల ఐరన్ ఓర్ దోచుకున్నారని, ఆ లారీల కిందపడి 300 మంది వరకూ మరణించారని వర్ల రామయ్య ఆరోపించారు.

Yatra
Varla Ramaiah
Dwivedi
Jagan
Gali janardhan Reddy
Rajasekhar Reddy
  • Loading...

More Telugu News