YSRCP: ఎన్నికల తర్వాత బీజేపీలో వైసీపీని విలీనం చేస్తారు: కళా వెంకట్రావు

  • వైసీపీ నేతలకు, కార్యకర్తలకు బహిరంగ లేఖ
  • మీ నేత ఏ విషయంలో సమర్థుడు?
  • జగన్ స్వార్థానికి మీ బతుకులు నాశనం చేసుకోకండి

ఈ ఎన్నికల తర్వాత బీజేపీలో వైసీపీని విలీనం చేస్తారని టీడీపీ నేత కళా వెంకట్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘మీరు ‘జేజేలు’ కొడుతున్న నేత ఏ విషయంలో సమర్థుడు? ప్రతిపక్ష హోదాను అపహాస్యం చేసిన వ్యక్తి జగన్. కార్యకర్తలను నీళ్లు లేని బావిలోకి నెట్టేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. జగన్ స్వార్థానికి మీ బతుకులు నాశనం చేసుకోకండి. పదేళ్లలో టీడీపీ కార్యకర్తల కోసం రూ.90 కోట్లు ఖర్చు చేసింది. ఈ పదేళ్లలో వైసీపీ తన కార్యకర్తలకు ఏం చేసింది?’ అని ఆ లేఖలో ప్రశ్నించారు.

ఏపీ ప్రజలను బూతులు తిట్టిన కేసీఆర్ తో చేతులు కలిపారని, తన ఆస్తులను కాపాడుకునేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం షెడ్యూల్ 9,10 ఆస్తులను కేసీఆర్ కు బేరం పెట్టారని ఆరోపించారు. 31 కేసులున్న వ్యక్తిని నమ్మి, ఎవరైనా ఏపీలో పెట్టుబడులు పెడతారా? అని ప్రశ్నించారు. పోలింగ్ ముగిశాక వైసీపీ దుకాణం మూసేయడం ఖాయమని, కేసీఆర్ దోస్తీతో వైసీపీ రాజకీయంగా సమాధి కానుందని, జగన్ ను నమ్ముకుంటే కార్యకర్తలకు భవిష్యత్ లేకుండా చేస్తారని, కళ్లు తెరిచి, జగన్ కబంధ హస్తాల నుంచి బయటకు రావాలని తన లేఖలో కళావెంకట్రావు పిలుపు నిచ్చారు.

YSRCP
jagan
Telugudesam
kala venkatarao
kcr
bjp
  • Loading...

More Telugu News