India: మేం కూల్చింది ఎఫ్-16 విమానాన్నే: భారత వాయుసేన స్పష్టీకరణ

  • అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి
  • నౌషేరా సెక్టార్ లో ఈ ఘటన జరిగింది
  • ఐఏఎఫ్ స్పష్టీకరణ

బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఫిబ్రవరి 27న భారత్ లోకి పాకిస్థాన్ యుద్ధ విమానాలు రావడం, ఆపై భారత వాయుసేన దీటుగా స్పందించి ఓ పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేయడం తెలిసిందే. ఆ విమానం అమెరికా తయారీ ఎఫ్-16 అని భారత్ ఆధారాలతో సహా స్పష్టం చేస్తుండగా, అది ఎఫ్-16 కాదని పాక్ బుకాయిస్తోంది. ముఖ్యంగా, ఆ విమానం అమ్మకందారు అమెరికాను నమ్మించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిపై మరోసారి భారత వాయుసేన స్పందించింది.

ఫిబ్రవరి 27న జరిగిన పోరాటంలో తాము కూల్చింది ఎఫ్-16 విమానాన్నే అని పునరుద్ఘాటించింది. నౌషేరా సెక్టార్ లో తమ మిగ్-21 బైసన్ విమానం పాక్ కు చెందిన ఎఫ్-16తో హోరాహోరీతో తలపడి దాన్ని కూల్చివేసిందని ఐఏఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. భారత వాయుసేన ఈ ప్రకటన వెలువరించడానికి ముందు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ కు అందించిన ఎఫ్-16 విమానాలన్నీ నిక్షేపంగా ఉన్నాయని, ఒక్కటి కూడా మిస్ కాలేదని అమెరికా ఫారెన్ పాలసీ మ్యాగజైన్ లో కథనం వచ్చింది. ఈ నేపథ్యంలో  ఐఏఎఫ్ గట్టిగా బదులిచ్చింది.

  • Loading...

More Telugu News