West Godavari District: ‘నిన్ను నమ్మం బాబు’ అని తేల్చి చెప్పండి: వైఎస్ షర్మిళ

  • రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన డబ్బు ఎక్కడున్నట్టు?
  • ఆ డబ్బంతా చంద్రబాబు బొజ్జలో ఉన్నట్టా?
  • మరో ఐదేళ్లు అవకాశమిస్తే అమరావతిని అమెరికా చేస్తాడట!

‘నిన్ను నమ్మం బాబు’ అని చంద్రబాబుకు తేల్చి చెప్పాలని ప్రజలకు వైసీపీ మహిళా నేత షర్మిళ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ, ఏపీ రాజధాని నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలను ఇచ్చామని కేంద్రం చెబుతోందని, ఆ డబ్బు అంతా ఏమైనట్టు? ఆ డబ్బంతా చంద్రబాబు బొజ్జలో ఉన్నట్టా? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేదు కానీ, మరో ఐదేళ్లు అవకాశమిస్తే అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ లా చేస్తాడట, మన చెవిలో పువ్వులు పెడతాడట' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

West Godavari District
aachanta
YSRCP
sharmila
  • Loading...

More Telugu News