janasena: పవన్ కల్యాణ్ కు స్వల్ప అస్వస్థత

  • కళ్లు తిరిగి పడిపోయిన పవన్
  • గన్నవరం ఎయిర్ పోర్టులో సంఘటన
  • ఆయుష్ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది 

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయన కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే, పవన్ ని వైద్య చికిత్స నిమిత్తం ఆయుష్ ఆసుపత్రికి ఆయన సిబ్బంది తరలించారు. విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. కాగా, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో, తెనాలిలో పవన్ పర్యటనలు రద్దయినట్టు సమాచారం.

ఎండ తీవ్రత అధికంగా ఉండటం, అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పవన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఈరోజు జరగాల్సిన సత్తెనపల్లి, తెనాలి జనసేన ఎన్నికల శంఖారావం సభలలో ఆయన పాల్గొనలేకపోతున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

janasena
Pawan Kalyan
gannavaram
  • Loading...

More Telugu News