chintamaneni Prabhakar: ఏలూరులో టీడీపీ, వైసీపీ మధ్య వివాదం.. చింతమనేనిని తోసేసిన కానిస్టేబుల్

  • సీఆర్ రెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్తత
  • ఉద్యోగులను ప్రలోభ పెడుతున్నారని టీడీపీ ఆరోపణ
  • రిటర్నింగ్ అధికారికి చింతమనేని ఫిర్యాదు

పశ్చిమ గోదావరి జిల్లా సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు ఉద్యోగులను ప్రలోభ పెడుతున్నారంటూ టీడీపీ ఆరోపించడంతో వాగ్వాదం మొదలైంది. ఇంతలో సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అక్కడికి వచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసుల్లో ఒక కానిస్టేబుల్ చింతమనేనిని తోసివేయడంతో ఆయన కింద పడబోయారు. ఈ పరిణామాలతో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనేందుకు వచ్చిన ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. దీంతో  పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం చింతమనేని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

chintamaneni Prabhakar
Constable
Postal Ballet
Eluru
Returning Officer
  • Loading...

More Telugu News