YSRCP: టీడీపీ నేతలపై ఉన్న ఆరోపణలతో పోలిస్తే జగన్ పై ఉన్నవి ఎంత?: జీవితా రాజశేఖర్

  • కాల్ మనీ కేసులో టీడీపీ నేతలు లేరా?
  • మహిళలను అవమానపరిచిన టీడీపీ నేతలు లేరా?
  • రాష్ట్రాన్ని చంద్రబాబు కుటుంబం దోచుకుంటోంది

టీడీపీ నేతలపై ఉన్న ఆరోపణలతో పోలిస్తే జగన్ పై ఉన్నవి ఎంత? అని వైసీపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్ ప్రశ్నించారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టీడీపీ నేతలు మాట్లాడితే జగన్ పై అన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయని విమర్శిస్తున్నారని, కాల్ మనీ కేసులో, మహిళా అధికారిణులపై దాడి చేసిన కేసులో టీడీపీ నేతలు లేరా? అని ప్రశ్నించారు.

మహిళలను ఎంతగా అవమానపరచాలో అంతగా అవమానపరుస్తున్న టీడీపీ ప్రభుత్వం, ‘పసుపు-కుంకుమ’ పేరుతో డబ్బులివ్వడం విడ్డూరమని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, ఆయన కొడుకు, నందమూరి బాలకృష్ణ దోచుకుంటున్నారని, ఇప్పుడు, కొత్తగా బాలకృష్ణ చిన్నల్లుడు కూడా తోడయ్యాడని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్లందరూ కలిసి మూకుమ్మడిగా కొట్టేసిస్తున్న డబ్బు ఎంత? అని ప్రశ్నించారు. 

YSRCP
jeevita
Telugudesam
jagan
Vijayawada
  • Loading...

More Telugu News