Telugudesam: మోదీ, కేసీఆర్, జగన్ గుంటనక్కలు... ఏమీ చేయలేరు!: నారా రోహిత్

  • గుంటూరు జిల్లాలో నారావారి హీరో
  • కోడెలతో కలిసి ఎన్నికల ప్రచారం
  • కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం

టాలీవుడ్ యువ హీరో నారా రోహిత్ టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం గుండ్లపల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానీకాన్ని ఉద్దేశించి కాస్త ఘాటైన పదజాలంతో టీడీపీ వ్యతిరేకులపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ లను ఏకిపారేశారు. వారు ముగ్గురూ గుంటనక్కలని విమర్శించారు. ఎవరెన్ని కుయుక్తులకు పాల్పడినా ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి మోదీ, కేసీఆర్, జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. రాష్ట్రం మరోసారి ప్రగతిపథంలో నడవాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని నారా రోహిత్ స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో రోహిత్ తో పాటు టీడీపీ సీనియర్ నేత, సత్తెనపల్లి అభ్యర్థి కోడెల శివప్రసాదరావు కూడా ఉన్నారు,

  • Error fetching data: Network response was not ok

More Telugu News