aadi: 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' నుంచి ఫస్టు లిరికల్ సాంగ్

  • ఆది హీరోగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'
  • సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు      

సాయికిరణ్ అడవి దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథా చిత్రంగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' రూపొందుతోంది. ఆది .. నిత్య నరేశ్ .. సషా ఛెత్రి .. పార్వతీశం .. అబ్బూరి రవి ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, తాజాగా హీరో రామ్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"పరుగు తీస్తోన్న పరువమా .. పరిమళిస్తోన్న మరువమా .. తలపు లోతుల్లో తీయని గాయమా .. అతనితో చూపు కలుపుమా .. సూటిగా మాట తెలుపుమా .. బయటపడలేని తికమక న్యాయమా .. " అంటూ ఈ పాట సాగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. యామినీ ఘంటసాల ఆలాపన .. శ్రీచరణ్ పాకాల సంగీతం .. యూత్ మనసులను ఆకట్టుకునేలా వున్నాయి. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

aadi
nithya naresh
parwathisham
  • Error fetching data: Network response was not ok

More Telugu News