USA: రోడ్డుపై దిగిన హెలికాప్టర్... వేగంగా వచ్చి ఢీకొన్న ట్రక్కు!

  • ఫ్లోరిడాలో ఘటన
  • సాంకేతిక లోపంతో రోడ్డుపై దిగిన హెలికాప్టర్
  • ఒకరి మృతి

గాల్లో ఎగరాల్సిన హెలికాప్టర్ సాంకేతిక లోపంతో రోడ్డుపై దిగడం ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ ఘటన. ఇద్దరు వ్యక్తులతో వెళుతున్న తేలికపాటి హెలికాప్టర్ గాల్లోకి లేచిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో, ఆ హెలికాప్టర్ ను పైలట్ పామ్ నదీతీరం సమీపం నుంచి వెళుతున్న నేషనల్ హైవేపై దించాడు.

ఆ హెలికాప్టర్ ను రోడ్డు పక్కకి నడిపించే సమయంలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి హెలికాప్టర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలికాప్టర్ రోటార్ బ్లేడ్లు ట్రక్కులోకి చొచ్చుకుని పోవడంతో డ్రైవర్ ప్రాణాలు వదిలాడు. హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. హెలికాప్టర్ కూడా దెబ్బతిన్నది. ఈ దుర్ఘటన కారణంగా ఆ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

USA
  • Loading...

More Telugu News