budda venkanna: పీవీపీ ఇంట్లో కోట్లాది రూపాయలు ఉన్నాయి: బుద్ధా వెంకన్న

  • టీడీపీ కంటే ఎక్కువ ధనవంతులు వైసీపీలో ఉన్నారు
  • వారిపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదు?
  • మోదీ దత్తపుత్రుడు జగన్

టీడీపీ నేతలపై జరుగుతున్న ఐటీ, పోలీసుల దాడులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. టీడీపీ కంటే ఎక్కువ ధనవంతులు వైసీపీ అభ్యర్థులుగా ఉన్నారని అన్నారు. పీవీపీ, బొత్స సత్యనారాయణ, మాగంటి శ్రీనివాసులు రెడ్డి, పీలేరు రామచంద్రారెడ్డి వంటి వారిపై ఐటీ అధికారులు ఎందుకు దాడి చేయడం లేదని ప్రశ్నించారు.

 ఎన్నికల కోసం కోట్లాది రూపాయలను పీవీపీ తన ఇంట్లో సిద్ధంగా ఉంచుకున్నారని చెప్పారు. సొంత పార్టీ కార్యకర్తలతోనే దాడి చేయించుకుని సానుభూతిని పొందేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని అన్నారు. దత్త పుత్రుడు కాబట్టే జగన్ కు అనుకూలంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

budda venkanna
jagan
Telugudesam
ysrcp
pvp
  • Loading...

More Telugu News