jc: చేతులు కలిపిన ప్రత్యర్థులు.. అనంతపురం టీడీపీలో ఆనందోత్సాహాలు

  • జేసీ, ప్రభాకర్ చౌదరి మధ్య వైరం
  • చౌదరితో కలసి ప్రచారం నిర్వహించిన జేసీ కుమారుడు
  • పలు ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య కొంత కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి, జేసీ కుమారుడు పవన్ కుమార్ రెడ్డి (టీడీపీ ఎంపీ అభ్యర్థి)లు మొన్నటి వరకు ఎవరికి వారే ప్రచారం చేసుకున్నారు.

దీంతో, తెలుగు తమ్ముళ్లు ఒకింత ఆందోళనకు గురయ్యారు. కానీ, నిన్న ఇద్దరూ కలసి ప్రచారం నిర్వహించడంతో... పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అనంతపురం పట్టణంలో ఇద్దరూ కలసి పలు ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇటీవల అనంతపురం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఇద్దరు నేతలను పిలిచి... కలసి ముందుకు సాగాలని సూచించారు. దీంతో, ప్రత్యర్థులిద్దరూ ఒకటయ్యారు.

jc
diwakar reddy
pavan reddy
prabhakar chowdary
Telugudesam
anantapur
  • Loading...

More Telugu News