West Godavari District: టీడీపీలో చేరిన పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ ఖాసిం

  • సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే రామాంజనేయలు
  • ఎన్నికల ముందు జిల్లాలో కమల దళానికి షాక్‌
  • బాబు అభివృద్ధి పథం నచ్చి చేరినట్లు వెల్లడి

 పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ ఖాసిం తెలుగుదేశం పార్టీలో చేరారు. భీమవరంలోని చిన అప్పారావు తోటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామాంజనేయల సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆయన మెడలో పసుపుకండువా వేసి సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా షేక్‌ఖాసిం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఇదే సందర్భంగా మైనార్టీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు మహబూబ్‌జానీ ఆధ్వర్యంలో మరో వంద మంది టీడీపీలో చేరారు.

West Godavari District
bhimavaram
mainority cell president
Telugudesam
BJP
  • Loading...

More Telugu News