karunakar reddy: కరుణాకర్ రెడ్డీ... తోక జాడించకు.. నార తీసి కూర్చోబెడతా: పవన్ కల్యాణ్

  • జనసైనికుడిపై చేయి పడినా, ఒక్క ఆడపడుచును ఇబ్బంది పెట్టినా ఊరుకోను
  • నేను చిరంజీవిని కాదనే విషయం గుర్తుంచుకో
  • జగన్, కరుణాకర్ రెడ్డిలాంటి రౌడీలు యూపీలో వీధికొకరు ఉంటారు

వైసీపీ తిరుపతి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క జనసైనికుడిపై చేయి పడినా, ఒక్క ఆడపడుచును ఇబ్బంది పెట్టినా చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తోక జాడిస్తే నారతీసి కూర్చోబెడతానని వార్నింగ్ ఇచ్చారు.

ఇది 2009 కాదని, 2019 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తాను చిరంజీవిని కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని చెప్పారు. 2009 ఎన్నికల్లో చిరంజీవిలాంటి ఓ బలమైన వ్యక్తిపై కెన్సెస్ హోటల్ వేదికగా కరుణాకర్ రెడ్డి రౌడీ మూక దౌర్జన్యానికి దిగిందని... ఆ ఘటనను తాను ఎన్నటికీ మర్చిపోనని చెప్పారు.  

జగన్ కానీ, కరుణాకర్ రెడ్డిలాంటి రౌడీలు కానీ ఉత్తరప్రదేశ్ లో వీధికొకరు ఉంటారని... అలాంటా రౌడీలను బీఎస్పీ అధినేత్రి మాయావతి రుద్రకాళిలా చీల్చిచెండాడారని పవన్ అన్నారు. కరుణాకర్ రెడ్డిని ఓడించడానికి తిరుపతి నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచు ఓ మాయావతిలా మారాలని పిలుపునిచ్చారు.

karunakar reddy
pawan kalyan
bhumana
ysrcp
janasena
tirupati
  • Loading...

More Telugu News