YSRCP: ఉగాది రోజున మేనిఫెస్టో విడుదలకు సిద్ధమవుతున్న వైసీపీ

  • రేపు  విజయవాడలో జగన్‌ చేతులు మీదుగా విడుదల
  • ఇప్పటి వరకు మేనిఫెస్టోలు విడదల చేయని వైసీపీ, టీడీపీ
  • ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడి

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఎన్నికల కోసం తన మేనిఫెస్టోను శనివారం విడుదల చేయాలని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోటాపోటీగా తలపడుతున్న ప్రధాన పక్షాలైన టీడీపీ, వైసీపీలు ఇప్పటి వరకు తమ మేనిఫెస్టోలు విడుదల చేయలేదు. ఒకరు విడుదల చేస్తే మరొకరు చేద్దామన్న వ్యూహాత్మక ఎత్తుగడతో ఇన్నాళ్లు వ్యవహరిస్తూ వచ్చిన రెండు పార్టీలు ఇక ఎన్నికలకు పట్టుమని వారం కూడా లేని పరిస్థితుల్లో ముందుకు వస్తున్నాయి.

ఈ క్రమంలో శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలో వైసీపీ మేనిఫెస్టోను జగన్ విడుదల చేయనున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న జగన్‌ తన ఎన్నికల ప్రచార సభల్లో ‘నవరత్నాలు’ గురించి ప్రసంగిస్తున్నారు. తాజా మేనిఫెస్టోలో ఈ అంశాలతోపాటు ఇంకా ఏమైనా అదనపు అంశాలు జోడిస్తారా? అన్నది వెల్లడి కావాల్సి ఉంది. ఈరోజు ఎన్నికల ప్రచారం పూర్తయిన అనంతరం జగన్‌ రాతిక్రి విజయవాడ చేరుకుంటారని సమాచారం.

  • Loading...

More Telugu News