Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం.. ఇంకోసారి ఓటేసి గెలిపించండి!: హీరో నిఖిల్

  • కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నటుడు
  • ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేసిందని వ్యాఖ్య
  • టీడీపీకి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సినీ గ్లామర్ తోడవుతోంది. హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత, తనీష్, పృథ్వీ, కృష్ణుడు, జయసుధ తదితరులు ఇప్పటికే వైసీపీలో చేరారు. తాజాగా యువ హీరో నిఖిల్ టీడీపీ తరఫున ప్రచారంలోకి దిగారు. కర్నూలు జిల్లాలోని డోన్, పత్తికొండతో పాటు పలు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా ప్రజలను కోరారు.

ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీతోనే సాధ్యమని నిఖిల్ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. అన్నివర్గాలను ఆదుకున్న టీడీపీని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డోన్‌లో టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని నిఖిల్‌ ప్రజలను కోరారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
hero
Tollywood
nikhuil
nikhil
  • Loading...

More Telugu News