Road Accident: మెదక్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం...40 మందికి గాయాలు

  • పెళ్లి బృందం వస్తున్న బస్సు, కంటైనర్‌ ఢీ
  • బస్సులోని ప్రయాణికులందరికీ గాయాలు
  • అల్లాదుర్గం మండలం మస్లాపూర్‌ గ్రామ శివారులో ఘటన

తెలంగాణలోని మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం మస్లాపూర్‌ గ్రామ శివారులో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందానికి చెందిన 40 మందితో వస్తున్న బస్సు, కంటైనర్‌ ను ఢీకొట్టిన ప్రమాదంలో బస్సులో ఉన్నవారంతా గాయపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.

పోలీసుల కథనం మేరకు సంగారెడ్డి జిల్లా నాగుల్‌గిద్ద మండలంలోని కేస్వార్‌ గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ పెళ్లి గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగింది. పెళ్లికి హాజరైన అతని కుటుంబ సభ్యులు, బంధువులు వివాహానంతరం ఆర్టీసీ అద్దె బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. బస్సు ముస్లాపూర్‌ గ్రామ శివారులోకి రాగానే నాందేడ్‌ వైపు నుంచి ఎదురుగా వచ్చిన కంటైనర్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు జోగ్‌పేట, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

Road Accident
Medak District
maslapur village
40 injured
  • Loading...

More Telugu News