Chandrababu: నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను... అద్వానీ ఇప్పుడు చెప్పారంతే: చంద్రబాబు

  • ప్రజాస్వామ్య విలువలు తెలియని మోదీ
  • దేశ భవిష్యత్తు ఆయన చేతిలోనా
  • అద్వానీ మాటలు మోదీని ఉద్దేశించినవేనన్న చంద్రబాబు

ప్రజాస్వామ్య విలువలు తెలియని ఒక వ్యక్తి చేతిలో దేశ భవిష్యత్తు పడిపోయిందన్న విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఇప్పుడు దాన్నే అద్వానీ కాస్తంత సున్నితంగా చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని పలు ట్వీట్లు పెట్టిన ఆయన, "ప్రజాస్వామ్య విలువలు తెలియని ఒక వ్యక్తి చేతిలో, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అన్న విషయాన్ని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. అదే విషయాన్ని అద్వానీ గారు సున్నితంగా చెప్పారు" అని అన్నారు.

అంతకుముందు "రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గారు అన్న మాటలు  నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నట్లుగానే ఉంది. మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చెయ్యడమే కాకుండా, కుట్రలతో మనపై దాడులు చేస్తున్న నరేంద్ర మోడీ, తన స్వార్ధం కోసం తన పార్టీని దేశాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతోంది" అని, "జాతీయ వాదం అంటే మన వైవిధ్యాలన్నిటినీ కాపాడుకుంటూ, భావప్రకటనా స్వేచ్ఛ కలిగి ఉంటూ, ప్రజాస్వామ్యం వారసత్వ పునాదుల్ని బలపరచటమే కానీ, మనతో విభేదించిన వారిని మన ప్రత్యర్థులను, శత్రువులలాగా చూడటం కాదు... దేశ ద్రోహులుగా ముద్ర వేయడం కాదు" అని ట్వీట్లు పెట్టారు.

"దేశమే ముందు. ఆ తర్వాతే పార్టీ. ఆ తర్వాతే వ్యక్తి. వాక్ స్వాతంత్ర్యం, వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ సమాజానికి వారసత్వ మూలాలు. గతం నుంచి నేర్చుకుంటూ, ఆత్మావలోకనం చేసుకుంటూ, భవిష్యత్తు వైపు చూడాలి" అని చంద్రబాబు సూచించారు. 

Chandrababu
Democracy
LK Advani
Narendra Modi
  • Error fetching data: Network response was not ok

More Telugu News