Bandla Ganesh: ఇక రాజకీయాలు వద్దు... తప్పుకుంటున్నా!: బండ్ల గణేశ్ సంచలన ప్రకటన

  • రాహుల్, ఉత్తమ్ లకు కృతజ్ఞతలు
  • వ్యక్తిగత కారణాలతోనే నిష్క్రమణ
  • ట్విట్టర్ లో వెల్లడించిన బండ్ల గణేశ్

"నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు" అని ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో నటుడు, నిర్మాత, తెలంగాణ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేశ్ సంచలన ప్రకటన చేశారు. ఆపై "కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను" అని పేర్కొన్నారు. బండ్ల గణేశ్ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.





Bandla Ganesh
Congress
Politics
Rahul Gandhi
  • Loading...

More Telugu News