Shatrughan Sinha: రాజ్‌నాథ్ సింగ్‌తో తలపడనున్న శత్రుఘ్న సిన్హా భార్య.. లక్నో నుంచి ఎస్పీ టికెట్‌పై బరిలోకి

  • లక్నో నుంచి బరిలోకి దిగనున్న పూనం సిన్హా
  • లక్నోలో అభ్యర్థిని నిలబెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయం
  • రసవత్తరంగా లక్నో బరి

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా భార్య పూనం సిన్హా పోటీ చేయనున్నారు. రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి బరిలోకి దిగగా, పూనం కూడా అక్కడి నుంచే బీఎస్పీ మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పూనంకు మద్దతు ఇవ్వాలని, లక్నో బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పుడు లక్నోలో ప్రధాన పోటీ రాజ్‌నాథ్-పూనం మధ్యే జరగనుంది.

పూనం సింధీ వర్గానికి చెందిన వారు కాగా, ఆమె భర్త శత్రుఘ్న సిన్హా కాయస్థ వర్గానికి చెందిన వారు. లక్నోలో 1.3 లక్షల సింధీ ఓట్లు, 4 లక్షల కాయస్థ ఓట్లు ఉన్నాయి. అలాగే, 3.5 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి. దీంతో ఇవన్నీ గంపగుత్తగా పూనంకు పడే అవకాశం ఉందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు.

Shatrughan Sinha
Poonam Sinha
Rajnath Singh
Lucknow
Uttar Pradesh
  • Loading...

More Telugu News