Telugudesam: నమ్మినవాళ్లను మోసం చేయడం చంద్రబాబు సహజగుణం: కన్నా లక్ష్మీనారాయణ

  • దోపిడీయే పరమావధిగా చంద్రబాబు పాలన  
  • వరికపుడిసెల ప్రాజెక్టును ప్రభుత్వం విస్మరించింది
  • కేంద్రం ఏపీకి రూ.5 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చింది

నమ్మిన వారిని మోసం చేయడం చంద్రబాబు సహజగుణమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దోపిడీయే పరమావధిగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని ఆరోపించారు.

జన్మభూమి కమిటీల పేరిట చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లు కోట్లాది రూపాయలు దోచుకున్నారని, నర్సరావుపేటలో కోడెల శివప్రసాద్, ఆయన కొడుకు, కూతురు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, అదేవిధంగా, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వరకపూడి శిలా ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని, తనను గెలిపిస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ కేంద్రం ఏపీకి రూ.5 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిందని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రభుత్వం ఇంత భారీ నిధులు ఏపీకి ఇవ్వలేదని అన్నారు.

Telugudesam
Chandrababu
bjp
kanna
modi
  • Loading...

More Telugu News