Janasena: నాగబాబుకి మద్దతుగా ప్రచారానికి వస్తున్న బన్నీ, వరుణ్ తేజ్

  • నిహారిక, పద్మజ ప్రచారం
  • యూఎస్‌లో ఉన్న వరుణ్‌తేజ్
  • నాగబాబు తప్పక గెలుస్తారని ఆశాభావం

జనసేన తరఫున నరసాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న ప్రముఖ నటుడు నాగబాబుకు మద్దతుగా ప్రచారం చేయడానికి మెగా హీరోలు దిగుతున్నారు. ఇప్పటికే ఆయన తరుపున ఆయన కూతురు నిహారిక, భార్య పద్మజ ప్రచారం నిర్వహిస్తున్నారు.  

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు భార్య పద్మజ ఎన్నికల ప్రచారం గురించి వివరించారు. మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ప్రస్తుతం వరుణ్ యూఎస్‌లో ఉన్నాడని.. రేపు అక్కడి నుంచి వస్తాడని, రాగానే ప్రచారంలో పాల్గొంటారని పద్మజ తెలిపారు. నాగబాబుకు సాయం చేసే గుణం చాలా ఎక్కువని, ఎవరికైనా ఏదైనా జరిగితే వెంటనే స్పందిస్తారని పేర్కొన్నారు. నాగబాబు ఎంపీగా గెలవడం ఖాయమని పద్మజ ఆశాభావం వ్యక్తం చేశారు.

Janasena
Nagababu
Pawan Kalyan
Padmaja
Niharika
Allu Arjun
Varun Tej
  • Loading...

More Telugu News