KTR: దమ్ముంటే మూడు సీట్లు గెలిచి చూపించండి: కేటీఆర్ సవాల్

  • చౌకీదార్, హిందూమతమే అజెండా
  • డైలాగ్‌లు చెప్పడం తప్ప చేసిందేమీ లేదు
  • రాజకీయాల్లో ముద్ర వేసే నాయకుడు కావాలి

దమ్ముంటే తెలంగాణలో 3 సీట్లు గెలిచి చూపించాలని బీజేపీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. కౌరవులు వంద మంది ఉన్నా, పాండవులే యుద్ధంలో విజయం సాధించారన్నారు. మందబలం ముఖ్యం కాదని, దేశ రాజకీయాల్లో ముద్ర వేసే నాయకుడు కావాలన్నారు. మోదీ ఎన్నికల అజెండా, చౌకీదార్, హిందూ మతమేని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

డైలాగ్‌లు చెప్పడం తప్ప మోదీ ఏమీ చేయలేదని విమర్శించారు. మోదీ, అమిత్‌షా, ఆరు రాష్ట్రాల సీఎంలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసినా బీజేపీకి 100 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. రాజకీయ పార్టీలను కేవలం రెండు సీట్లతో కదిలించిన కేసీఆర్, 16 సీట్లు వస్తే ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో చూస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR
Narendra Modi
Amith Shah
BJP
KCR
Assembly Elections
  • Loading...

More Telugu News