Guntur: ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళుతున్నామని చెప్పి.. భారీ మొత్తంతో దొరికిపోయిన వైనం

  • రూ.1.15 కోట్లను తరలిస్తుండగా పట్టివేత
  • ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళుతున్నామని వెల్లడి
  • ఆధారాలు చూపించలేక పట్టుబడ్డారు

నగదును ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళుతున్నట్టు అధికారులను బురిడీ కొట్టించబోయారు కానీ కథ అడ్డం తిరిగింది. ఆధారాలు చూపించలేక పట్టుబడ్డారు. గుంటూరు నగరంలోని డొంక రోడ్డు రహదారిలో రూ.1.15 కోట్ల నగదును కారులో తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకుంది.

విచారించగా నగదును ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళుతున్నామని కారులోని వ్యక్తులు అధికారులకు చెప్పారు కానీ ఆధారాలు చూపించ లేకపోయారు. దీంతో నగదును అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించి, సదరు నగదును ఎక్కడికి తీసుకెళుతున్నారనే దానిపై విచారణ నిర్వహిస్తున్నారు. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News