Tirupati: పవన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు: మాయావతి

  • జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది
  • మెజార్టీ స్థానాలను సాధిస్తామన్న నమ్మకం ఉంది
  • మోదీ నాటకాలు ఇక సాగవు.. బీజేపీ అధికారంలోకి రాదు

పవన్ ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం తనకు ఉందని, మెజార్టీ స్థానాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను భారతీయ జనతా పార్టీ విస్మరించిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనలో దేశాభివృద్ధి తిరోగమనంలో నడిచిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తున్నారని, మోదీ నాటకాలు ఇక సాగవని, ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

Tirupati
janasena
Pawan Kalyan
bsp
maya
  • Loading...

More Telugu News