KTR: కౌరవులు వందమంది.. పాండవులు ఐదుగురే! చివరికి గెలిచిందెవరు?: కేటీఆర్

  • టీఆర్ఎస్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం
  • హాజరైన కేటీఆర్
  • గులాబీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నేత

తెలంగాణ కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే, హుస్నాబాద్ కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రవీణ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీలపై ధ్వజమెత్తారు. తాము 16 మంది ఎంపీలను గెలిపించుకుంటామంటే ఎన్నోరకాలుగా మాట్లాడుతున్నారని, ఒకప్పుడు కేసీఆర్ ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణను సాధించుకోలేదా? అని గుర్తుచేశారు. కౌరవులు వందమంది ఉన్నా పాండవులు ఐదుగురేనని, అంతిమంగా గెలిచింది ఎవరు? అని వ్యాఖ్యానించారు.

ఇద్దరు ఎంపీల అండతోనే కేసీఆర్ దేశ రాజకీయ వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ సాకారం చేశారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీలేదని కేటీఆర్ విమర్శించారు. సామాన్యుడికి మేలు చేకూరకపోగా, తానేం చేశాడో కూడా చెప్పుకోలేని స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News